దేశ భద్రత దృష్ట్యా ప్రముఖ గేమ్ 'పబ్జీ' సహా 118 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం ఇటీవల నిషేధించింది. ఈ నేపథ్యంలో పబ్జీని ఎంతో ఇష్టంగా ఆడే ధోనీపై నెట్టింట్లో మీమ్స్ వైరల్ అయ్యాయి. 'మహీ ఇకపై ఏ ఆట ఆడుతాడో మరి?' అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. తాజాగా దీనిపై స్పందించిన టీమ్ఇండియా బౌలర్ దీపక్ చాహర్.. మహీకి ఈ ఆటపై ఎప్పుడో పట్టు తప్పిందని చెప్పాడు. బ్యాన్ చేయకముందే కాల్ ఆఫ్ డ్యూటీ(కాడ్) అనే మరో గేమ్‌ను ఆడటం ప్రారంభించాడని తెలిపాడు. అయితే తాను మాత్రం ఆ ఆటను కొనసాగిస్తున్నట్లు చెప్పాడు.
"పబ్జీ.. ఇంకా ఆ గేమ్‌ను ఆడుతున్నా. కానీ ధోనీ ఆడట్లేదు. దానిపై మహీకి పట్టు పోయింది. ఎక్కడి నుంచి ఎవరు కాలుస్తున్నారో కనిపెట్టలేకపోతున్నాడు. అతడు ఇప్పుడు మరో గేమ్ 'కాల్ ఆఫ్ డ్యూటీ'తో బిజీగా ఉంటున్నాడు" అని చాహర్ చెప్పాడు.