తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ కెరీర్​ ఎలా మొదలైందో అలానే ముగిసింది - ధోనీ రన్​ ఔట్​

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ పంద్రాగస్టున అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. అయితే మహీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగియడం విశేషం. అదేంటో తెలుసుకుందాం.

MS Dhoni starts, and ends, his career with run-outs
ధోనీ

By

Published : Aug 16, 2020, 9:32 PM IST

క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పంద్రాగస్టున అంతర్జాతీయ క్రికెట్​కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే కెరీర్​లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహీ.. తన కెరీర్‌ను ఎలా మొదలుపెట్టాడో అలాగే ముగించడం విశేషం.

ధోనీ

2004లో డిసెంబర్‌ 23న చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్​లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ రనౌట్ అయ్యాడు. అలాగే 2019లో చివరసారిగా న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్​ సెమీఫైనల్ మ్యాచ్‌లో అనవసర పరుగు కోసం యత్నించి మహీ రనౌట్​గా వికెట్​ సమర్పించుకున్నాడు. అనంతరం జట్టుకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 15న వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

దీంతో కెరీర్‌లో తొలి, చివరి మ్యాచ్‌ల్లో రనౌట్ అయిన క్రికెటర్‌గా నిలిచాడు ధోనీ. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఫాస్టెస్ట్ రన్నర్ అయిన ధోనీ కెరీర్‌లో తొలి, చివరి మ్యాచ్‌లలో ఇలా వెనుదిరగడం గమనార్హం.

భారత జట్టుకు టీ20 ప్రపంచకప్(2007), వన్డే ప్రపంచకప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) అందించిన సారథిగా ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. కెరీర్‌లో ఈ మూడింటిని ఓ జట్టుకు అందించిన ఏకైక అంతర్జాతీయ సారథి ధోనీ కావడం మరో విశేషం.

ధోనీ

ఇది చూడండి ధోనీ ఆ సమయానికే ఎందుకు రిటైర్ అయ్యాడు?

ABOUT THE AUTHOR

...view details