తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్ తర్వాత ధోనీ చూపు అటువైపేనా..! - రాంచీ స్టేడియం

టీమిండియా మాజీ సారథి ధోనీ.. ఇటీవలే బిలియర్డ్స్​ ఆడుతూ కనిపించాడు. రిటైర్మెంట్​ తర్వాత ఈ గేమ్​నే తన కెరీర్​గా ఎంచుకుంటాడంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత..?

క్రికెట్ తర్వాత ధోనీ చూపు అటువైపేనా..!

By

Published : Sep 29, 2019, 6:55 PM IST

Updated : Oct 2, 2019, 12:08 PM IST

టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్​ ధోనీ రిటైర్మెంట్​పై వస్తున్న ఊహాగానాలే ప్రస్తుతం హాట్​టాపిక్​. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్​ తర్వాత అతడు క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకోవడమే ఇందుకు కారణం. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాతఈ క్రికెటర్ ఏం చేస్తాడనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ధోని చూపు బిలియర్డ్స్​ వైపు..!
ధోనీ.. ఇటీవలే సొంతూరు రాంచీలోని ఝార్ఖండ్​ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్​ స్టేడియంలో సందడి చేశాడు. బిలియర్డ్స్​ ఆడుతూ కనిపించాడు. ఆటకు రిటైర్మెంట్​ ప్రకటించినా తర్వాత ఈ గేమ్​ను తన కెరీర్​గా ఎంచుకుంటాడేమోనని అభిమానులు అనుకుంటున్నారు.

బిలియర్డ్స్​ ఆడుతున్న క్రికెటర్ ధోనీ

విరామం నవంబరు వరకు..!
ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్​తో సిరీస్​కు అందుబాటులో ఉండనని సెలక్టర్లుకు చెప్పాడు ధోనీ. అయితే ఆ తర్వాత జరిగే దక్షిణాఫ్రికా సిరీస్​కు ఈ క్రికెటర్​ను ఎంపిక చేయలేదు. మహీ విరామం నవంబరు వరకు కొనసాగనుందని సమాచారం.

ఆ సిరీస్​తోనే ధోనీ రీఎంట్రీ..!
డిసెంబరులో భారత్​లో పర్యటించనుంది వెస్టిండీస్​. ఆ సిరీస్​కు అందుబాటులో రానున్నాడు మహీ. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి ఇరుజట్లు. డిసెంబరు 6న తొలి మ్యాచ్​ జరగనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 2, 2019, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details