మహేంద్రసింగ్ ధోనీ ఏం చేసినా అభిమానులకు ఉత్సాహమే. గతేడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన మహీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం తరచూ కనిపిస్తున్నాడు. కుటుంబం, స్నేహితులతో సరదాగా గడుపుతున్నాడు. అయితే తాజాగా మహీ.. పానీపూరి వాలాగా మారిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ప్రస్తుతం సహ ఆటగాళ్లు ఆర్పీ సింగ్, పీయూష్ చావ్లాతో కలిసి మాల్దీవుల్లో సేదతీరుతున్నాడు ధోనీ. అక్కడ మహీ.. వీరిద్దరికి పానీపురి చేసి ఇస్తూ కనిపించాడు. దీనిపై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మల్టీ ట్యాలెంటెడ్ ధోనీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.