ధోని భవిష్యత్తుపై ఇప్పటికీ స్పష్టత లేదు. రిటైర్మెంట్‌పై ఊహాగానాలు అలాగే ఉన్నాయి. అతడు మాత్రం పెదవి విప్పట్లేదు. మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. భారత జట్టులో అత్యంత వేగంగా పరుగెత్తే ఆటగాణ్ని ఓడించినంత కాలం తాను క్రికెట్లో కొనసాగుతానని 2017లో కోహ్లీ పెళ్లి సమయంలో ధోనీ తనతో అన్నాడని చెప్పాడు.
'ధోనీ అప్పటివరకు క్రికెట్ ఆడతాడు' - dhoni ipl
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ కెరీర్ గురించి మాట్లాడిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. అతడెప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటాడో వెల్లడించాడు.
"కోహ్లీ పెళ్లిలో ధోనీతో కాసేపు మాట్లాడా. 'జట్టులో అత్యంత వేగంగా పరుగెత్తే ఆటగాడిని ఓడిచినంత కాలం.. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అవసరమైన ఫిట్‌నెస్ నాలో ఉందని భావిస్తా' అని అతడు అన్నాడు" -సంజయ్ మంజ్రేకర్
2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో చివరగా కనిపించాడు ధోనీ. అయినా సరే ఐపీఎల్‌లో మహీ రాణిస్తాడని మంజ్రేకర్ అన్నాడు. లీగ్‌లో నలుగురు లేదా ఐదుగురు ప్రమాదకర బౌలర్లుండడం వల్ల ధోనీకి ఎలాంటి సమస్యలు ఎదురుకావని చెప్పాడు. బ్యాట్స్‌మన్‌గా ఐపీఎల్‌లో ధోనీ ఆటేమీ మారలేదని తెలిపాడు. కెప్టెన్‌గా చెన్నై సూపర్‌కింగ్స్‌కు మూడు టైటిళ్లు అందించిన ధోనీ.. లీగ్‌లో మొత్తం 190 మ్యాచ్‌ల్లో 4432 పరుగులు చేశాడు.