భారత ప్రముఖ క్రికెటర్లు ధోనీ, అశ్విన్.. లాక్డౌన్ వల్ల తమ అకాడమీల్లోని యువ ఆటగాళ్లకు ఆన్లైన్ ద్వారా శిక్షణనిస్తూ బిజీగా ఉన్నారు. అయితే మహీ.. స్వయంగా ఈ సెషన్స్‌లో పాల్గొనట్లేదు. ట్రైనింగ్ ఇస్తున్న కోచ్‌లకు అంతర్జాలం ద్వారా సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. ఫిట్‌నెస్‌పై బోధించాల్సిన అంశాలను వివరిస్తున్నాడు. అనంతరం సదరు కోచ్‌లు, ఫేస్బుక్ లైవ్ ద్వారా ట్రైనీలకు శిక్షణ ఇస్తున్నారు.
"ఆన్లైన్ కోచింగ్ పట్ల ట్రైనీస్ చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కో వీడియోకు దాదాపు 10వేలకు పైగా వీక్షణలు వస్తున్నాయి. మా డెమో డ్రిల్స్‌ను 'క్రికెటర్' యాప్ ద్వారా అప్లోడ్ చేస్తున్నాం. ట్రైనీలు వారి సాధన వీడియోలను ఇదే యాప్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా వారి సాధనను పర్యవేక్షిస్తున్నాం."
-సత్రాజిత్ లహిరి , ధోనీ క్రికెట్ అకాడమీ చీఫ్ కోచ్