తెలంగాణ

telangana

ETV Bharat / sports

సాక్షిని ఆటపట్టించిన ధోనీ.. జ్ఞాపకాలు పదిలమంటూ పోస్ట్ - MS Dhoni

టీమిండియా మాజీ సారథి ధోనీ.. సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో భార్య సాక్షిసింగ్​ను ఆటపట్టిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది.

MS Dhoni
ధోనీ

By

Published : Dec 17, 2019, 6:51 AM IST

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, జట్టుకు దూరంగా ఉన్నా.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం సందడి చేస్తున్నాడు. భార్య సాక్షిని ఆటపట్టిస్తోన్న ఓ వీడియోను సోమవారం తన ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్​గా మారింది.

ఏడాది క్రితం ధోనీ.. తన భార్య సాక్షితో ఓ ప్రకటన షూటింగ్​లో పాల్గొన్నప్పటి వీడియో అది. అందులో సాక్షి డైలాగ్​ నేర్చుకుంటుండగా.. మహీ సరదాగా ఆటపట్టిస్తూ కనిపించాడు. వీరిద్దరి మధ్య వచ్చిన నవ్వులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అన్యోన్యమైన దంపతులంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రపంచకప్ తర్వాత ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు ధోనీ. కొన్ని రోజులు ఆర్మీలో సేవలందించిన మహీ.. ప్రస్తుతం సరదాగా గడుపుతున్నాడు. అయితే ఇప్పుడే ధోనీ జట్టులోకి రాకపోవచ్చని.. ఐపీఎల్ అతడి గమ్యాన్ని నిర్దేశిస్తుందని పలువురు ఆభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి.. సన్​రైజర్స్ హైదరాబాద్​​కు స్టార్ బౌలర్ స్టార్క్​!

ABOUT THE AUTHOR

...view details