తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ.. రిటైర్మెంట్​ గురించి ఆలోచించాలి' - ధోనీ ఐపీఎల్

ధోనీ ఫామ్​ గురించి మాట్లాడిన మాజీ సెలక్టర్ రోజర్ బిన్నీ.. అతడు మునుపటిలా లేడని, ఫిట్​నెస్​ కోల్పోయాడని అన్నారు. ఆడగలడా లేదా అనేది మహీనే ఆలోచించుకోవాలని అభిప్రాయపడ్డారు.

'ధోనీ.. రిటైర్మెంట్​ గురించి ఆలోచించాలి'
ధోనీ

By

Published : Aug 1, 2020, 8:42 PM IST

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ మునుపటిలా లేడని, గత కొన్ని సీజన్లుగా తన ఫిట్‌నెస్‌ కోల్పోయాడని మాజీ సెలక్టర్‌, మాజీ ఆల్‌రౌండర్‌ రోజర్‌ బిన్నీ అభిప్రాయపడ్డారు. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడిన ఆయన... ధోనీపై ఈ వ్యాఖ్యలు చేశారు.

'మహీ కాస్త ఫిట్‌నెస్‌ తగ్గాడు. ఇప్పుడు జట్టులోకి యువకులు వస్తున్నారు. వారికి తన స్థానాన్ని అందివ్వాలి. అలాగే అతను ఎలా ఆడగలడో మనకు తెలుసు. ఇప్పుడు ఆ పరిస్థితిని దాటి వచ్చేశాడు. ఇక తన ఆటపై నిర్ణయం తీసుకునే అవకాశం తనకే ఉంది. ఇంకా ఆడగలనా లేదా తప్పుకోవాలా అనేది ఆలోచించుకోవాలి' అని బిన్నీ పేర్కొన్నారు.

మహేంద్ర సింగ్ ధోనీ

తాను సెలెక్టర్‌గా ఉన్నప్పుడు ధోనీతో మంచి సంబంధాలు ఉన్నాయని, తమ మధ్య ఎప్పుడూ ఎలాంటి అభిప్రాయభేదాలు వ్యక్తం కాలేదని బిన్నీ చెప్పారు. మాజీ సారథి ఎంతో గౌరవప్రదమైన ఆటగాడని, అందరితో ఎంతో వినయంగా ఉంటాడని తెలిపారు. తనకేం కావాలో దాన్ని కచ్చితంగా అడుగుతాడని, అలాంటి విషయాల్లో డిమాండ్‌ చేయకుండా సున్నితంగా సంభాషిస్తాడని రోజర్‌బిన్నీ గుర్తుచేసుకున్నారు.

ధోనీ, గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఆటకు తాత్కాలిక విరామమిచ్చాడు. ఈ క్రమంలో మహీ భవితవ్యంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఐపీఎల్‌ ఆడతానని చెప్పడం వల్ల అభిమానులు సంతోషించారు. అదే సమయంలో లాక్‌డౌన్‌ విధించగా ఐపీఎల్‌ వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్‌ 19 నుంచీ మెగా టోర్నీ నిర్వహించే అవకాశం ఉన్నందున త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details