ఐపీఎల్ ప్రాక్టీసులో భాగంగా ప్రస్తుతం సొంతగడ్డపై ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ త్వరలో ముంబయికి పయనం కానుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈఓ విశ్వనాథన్ చెప్పారు. మార్చి 26న అక్కడికి వెళ్లనున్నట్లు తెలిపారు. రైనా నేరుగా అక్కడికి చేరుకుంటారని అన్నారు.
ఐపీఎల్ పాలక మండలి రూపొందించిన కొవిడ్ నిబంధనల వల్ల ఈసారి సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ కూడా చెన్నై ఆడటం కుదరదు. దీంతో ధోనీసేన ఆడే తొలి ఐదు మ్యాచ్‌లు ముంబయిలో జరగనున్న కారణంగా ప్రాక్టీసు క్యాంప్‌ను అక్కడికి మార్చినట్లు విశ్వనాథన్ వెల్లడించారు. ఏప్రిల్ 10న జరిగే తొలి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్కే తలపడనుంది.