చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ గొప్ప ఫినిషర్ అయ్యేందుకు గల కారణాలను వివరించాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మైకెల్ హస్సీ. ప్రస్తుతం సీఎస్కే బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న ఇతడు.. జట్టు సభ్యులతో జరిగిన లైవ్ చాట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బంతిని ఎలా బౌండరీ దాటించాలి.. బౌలర్‌ను ఎలా అయోమయానికి గురిచేయాలో మహీ బాగా విశ్లేషించగలడని చెప్పాడు. అందుకే అతడు ప్రపంచంలోని గొప్ప ఫినిషర్లలో ముందువరసలో ఉన్నాడని అన్నాడు.
"ఎప్పుడు వేగంగా ఆడాలి. ఎప్పుడు డిఫెన్స్ ఆడాలో ధోనీకి బాగా తెలుసు. అందుకే గొప్ప ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. జట్టు సభ్యులు అనుకున్నంతమేర ప్రదర్శన చేయనప్పుడు మహీ అసహనానికి గురవుతాడు. కానీ అది చాలా అరుదుగా జరుగుతుంది. గత 11ఏళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే ధోనీని అలా చూశాను"
-హుస్సీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్