తెలంగాణ

telangana

ETV Bharat / sports

"నాలుగో స్థానానికి ధోనియే కరెక్ట్" - anil kumble

ప్రపంచకప్​ దగ్గర పడుతున్న నేపథ్యంలో మాజీ భారత బౌలర్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ విభాగంలో నాలుగో స్థానానికి ధోని సరైన వాడని తెలిపాడు.

టీమిండియా బ్యాటింగ్​ ఆర్డర్​లో నాలుగో స్థానానికి ధోనియే సరైన వ్యక్తి అంటున్న కుంబ్లే

By

Published : Mar 17, 2019, 6:00 AM IST

రాబోయే ప్రపంచకప్​లో భారత బ్యాటింగ్​లో నాలుగో స్థానానికి మహేంద్ర సింగ్​ ధోనియే సరైన వాడని మాజీ భారత బౌలర్ అనిల్ కుంబ్లే అన్నాడు. ఈ స్థానంలో ఆడే బ్యాట్స్​మెన్​ కోసం టీమిండియా కొన్ని సంవత్సరాలుగా అన్వేషిస్తోంది.

" కొన్నేళ్ల నుంచి భారత జట్టు విజయాల్లో టాప్3 బ్యాట్స్​మెన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నా ఆలోచన ప్రకారం నాలుగో స్థానానికి ధోనియే సరైన వ్యక్తి" - అనిల్ కుంబ్లే, మాజీ భారత బౌలర్, మాజీ కోచ్

2016లో న్యూజిలాండ్​తో జరిగిన వన్డే సిరీస్​లో ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. దీంతో లోయర్​ మిడిలార్డర్ బలహీన పడింది. అందుకే 5,6 స్థానాల్లోనే బ్యాటింగ్ చేస్తూ వచ్చాడీ మాజీ కెప్టెన్​.

మహేంద్ర సింగ్ ధోని

ఆస్ట్రేలియా సిరీస్​కు ముందు రాయుడు నాలుగో స్థానంలో కుదురుకున్నట్లే కనిపించాడు. కానీ ఆస్ట్రేలియాతో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. అందుకే అతన్ని చివరి రెండు వన్డేలకు తప్పించి రాహుల్​కు అవకాశమిచ్చారు. తన మూడో స్థానాన్ని రాహుల్​కు ఇచ్చిన కోహ్లి..నాలుగులో బ్యాటింగ్​కు వచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details