లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన క్రికెటర్లందరూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా అభిమానులతో ముచ్చటించిన పాక్ ఆటగాడు కమ్రాన్ అక్మల్.. ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తరఫున వికెట్ కీపర్‌గా ధోనీ కచ్చితంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు.
"ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వికెట్ కీపర్‌గా ఎవరు ఉండాలని భావిస్తున్నారు?" అన్న ఓ నెటిజన్ ప్రశ్నకు స్పందించిన కమ్రాన్.. ఒకవేళ మహీ వికెట్‌కీపర్‌గా ఉండకపోతే ప్రత్యామ్నయంగా కేఎల్ రాహుల్ ఆడాలని అన్నాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ జట్టులో వికెట్‌కీపర్‌గా కొనసాగుతున్నాడు.