తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్ క్రికెటర్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు! - dhoni retirement

వచ్చే ఏడాది మార్చిలో ఆసియా ఎలెవన్ - రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ జట్ల మధ్య జరిగే టీ20 మ్యాచ్​ల్లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడనున్నాడు. ఇందుకోసం బీసీసీఐ అనుమతి కోరింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.

మహేంద్రసింగ్ ధోనీ

By

Published : Nov 26, 2019, 2:35 AM IST

ప్రపంచకప్ ముగిసి ఐదునెలలు దాటింది.. మహేంద్ర సింగ్ ధోనీని మైదానంలో చూసి అంత కాలమే అయింది. ఎప్పుడొస్తాడు ధోనీ? అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. ఈ ఎదురుచూపులకు త్వరలో సమాధానం దొరకనుంది. వచ్చే ఏడాది మార్చిలోమహీ.. మైదానంలో కనిపించే అవకాశముంది. ఇందుకోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ).. బీసీసీఐ అనుమతి కోరింది.

ఆసియా ఎలెవన్ - రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మధ్య వచ్చే ఏడాది మార్చి 18 నుంచి 21 వరకు రెండు టీ20లు నిర్వహించనుంది ఐసీసీ. ఆసియా జట్టులో భారత్ నుంచి ఏడుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. ఇందులో మహేంద్రసింగ్ ధోనీ ఉన్నాడు. ఈ మ్యాచ్​లకు బంగ్లాదేశ్​ ఆతిథ్యమివ్వనుంది.

"ఆసియా ఎలెవన్ - రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ జట్లకు మధ్య జరగబోయే రెండు టీ20లకు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్​ల్లో క్రికెటర్లు పాల్గొనేందుకు బీసీసీఐతో పాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులను సంప్రదించాం" -నిజాముద్దీన్ చౌదరి, బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్​.

మహీతో పాటు విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్​ బుమ్రా, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా.. ఆసియా ఎలెవన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

న్యూజిలాండ్​తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో మహీ చివరగా ఆడాడు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత పారా మిలటరీ దళంతో కలిసి పనిచేశాడు. అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ సిరీస్​లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు బంగ్లా నిర్వహిస్తున్న ఈ మ్యాచ్​ల్లో ధోనీ ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తే మహీని మళ్లీ మైదానంలో చూడొచ్చు.

ఇదీ చదవండి: బీసీసీఐ రాజ్యంగ సవరణ వల్ల దాదాకే ప్రయోజనం!

ABOUT THE AUTHOR

...view details