టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో సందడి చేశాడు మాజీ సారథి ఎంఎస్ ధోనీ. రాంచీ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన కోహ్లీ సేన.. సిరీస్ను 3-0తో గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ, రవిశాస్త్రి, జట్టు సభ్యులను కలిశాడు మహీ.
ధోనీ స్వరాష్ట్రంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ కాబట్టి తొలిరోజే మిస్టర్ కూల్ వస్తాడని అందరూ ఊహించారు. కానీ మూడు రోజుల వరకు మైదానంలో అడుగుపెట్టలేదు.. నాలుగోరోజు సఫారీలపై భారత్ 202 పరుగుల తేడాతో విజయం సాధించింది. సగర్వంగా ట్రోఫీ అందుకుంది. బహుమతి ప్రదానోత్సవం పూర్తయ్యాక.. మహీ టీమిండియా ఆటగాళ్లను కలుసుకున్నాడు.
" అద్భుత సిరీస్ విజయం తర్వాత తన సొంత అడ్డాలో టీమిండియా దిగ్గజాన్ని చూడటం ఎంతో బాగుంది" అని మహీని ఉద్దేశించి ట్వీట్ చేశాడు కోచ్ రవిశాస్త్రి.