ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించిన మహేంద్రసింగ్ ధోనీ.. సిక్సర్లు కొట్టడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సురేశ్ రైనాతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలో ధోనీ నెట్స్‌లో నుంచి వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టాడు. తాజాగా ఆ వీడియోను ఐపీఎల్ ప్రసార సంస్థ స్టార్‌స్పోర్ట్స్ పోస్టు చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది.
దూకుడుపైనే ధోనీ దృష్టి.. ప్రాక్టీస్‌లో 5 సిక్సర్లు - MS Dhoni hits five sixes in a row at the practice session of chinnaswamy while for Indian Premier League training
చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానులకు అప్పుడే ఐపీఎల్ మజా చూపిస్తున్నాడు ధోనీ. ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఈ స్టార్ బ్యాట్స్‌మన్.. సాధనలోనే ఐదు సిక్సర్లు బాదేశాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది స్టార్‌స్పోర్ట్స్ సంస్థ.
దూకుడుపైనే ధోనీ దృష్టి... ప్రాక్టీస్‌లో 5 సిక్సర్లు
మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై తలపడనుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో లెగ్‌స్పిన్నర్ పీయూష్ చావ్లా, ఆస్ట్రేలియా పేసర్ జోస్ హేజిల్‌వుడ్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్, తమిళనాడు ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆర్ సాయి కిషోర్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ సొంతం చేసుకుంది.