టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి పబ్‌జీ గేమ్‌పై టచ్ పోయిందని భారత బౌలర్ దీపక్ చాహర్ అన్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్.. దీపక్ చాహర్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేసింది. రెండు ఆప్షన్స్ ఇచ్చి ఏదైనా ఒక దానిని ఎంచుకోవాలని కోరింది. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్ లేదా పబ్‌జీ? అనే ప్రశ్నకు చాహర్ ఇలా బదులిచ్చాడు.
'ధోనీకి పట్టుపోయింది.. ఆడలేకపోతున్నాడు' - దీపక్ చాహర్ న్యూస్
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి పబ్‌జీ ఆటపై పట్టు పోయిందన్నాడు బౌలర్ దీపక్ చాహర్. చెన్నై సూపర్‌కింగ్స్ తాజాగా ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అతడు ఇప్పటికీ పబ్‌జీ ఆడుతున్నట్లు తెలిపాడు.
'ధోనికి పట్టుపోయింది.. ఆడలేకపోతున్నాడు'
"పబ్‌జీ. ఇంకా ఆ గేమ్‌ను ఆడుతున్నా. కానీ ధోనీ ఆడట్లేదు. పబ్‌జీపై అతడికి పట్టు పోయింది. ఎక్కడి నుంచి ఎవరు కాలుస్తున్నారో కనిపెట్టలేకపోతున్నాడు. అతడు ఇప్పుడు మరో గేమ్ ఆడుతున్నాడు. కాల్ ఆఫ్ డ్యూటీతో బిజీగా ఉంటున్నాడు" అని చాహర్ సరదాగా బదులిచ్చాడు. ధోనీ, చాహర్ ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదీ చూడండి..'యువ క్రికెటర్లు సీనియర్లను చూసి నేర్చుకోవాలి'