టీమిండియా స్పిన్నర్‌గా పలు రికార్డులు సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. తన కెరీర్‌పై మాజీ సారథి ధోనీ ప్రభావం బాగా ఉందని చెప్పాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎంపికైనప్పుడు, మెరుగైన ప్రదర్శన చేసి మహీ కళ్లలో పడేందుకు తీవ్రంగా శ్రమించినట్లు వెల్లడించాడు. సీఎస్కే జట్టు.. తన కెరీర్‌ను అద్భుతంగా మలిచిందని తెలిపాడు.
"చెన్నై జట్టులోని ప్రతి ఆటగాడు గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తాడు. నాకైతే మరింత ఎక్కువుగా ఉండేది. ఉత్తమ ఆటగాళ్లయిన ధోనీ, హేడెన్, మురళీధరన్‌కు అశ్విన్ అంటే ఎవరో తెలీదు. అందుకే నా ప్రతిభతో వాళ్ల దృష్టిలో పడాలని నిర్ణయించుకున్నాను. ధోనీ నన్ను గుర్తించేందుకు చాలా ప్రయత్నాలు చేశాను. ఎట్టకేలకు ఛాలెంజర్ ట్రోఫీలో అతడి దృష్టి నాపై పడింది"
-రవిచంద్రన్ అశ్విన్.