గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లోని సెమీస్ తర్వాత టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ నిరవధిక విరామం తీసుకున్నాడు. అప్పటి నుంచి అతడు తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు.
మైదానంలో మహీ కనిపించనప్పటికీ సోషల్ మీడియాలో అతడికి సంబంధించిన సమాచారం తెలుస్తూనే ఉంది. గురువారం ధోనీకి సంబంధించిన రెండు వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక దాంట్లో క్రికెట్ మైదానంలోని సాధన పిచ్‌ను రోలింగ్ చేసే వాహనాన్ని నడుపుతూ కనిపించాడు. ఇది రాంచీలోని మైదానంగా భావిస్తున్నారు. కొన్నాళ్లుగా అతడు ఝార్ఖండ్ క్రికెటర్లతో కలిసి సాధన చేస్తున్నాడు.
ధోనీకి వేర్వేరు వ్యాపారాలు ఉన్నాయి. ఈ మధ్యే అతడు సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రాంచీకి సమీపంలోని సొంత భూమిలో పుచ్చకాయలు సాగుచేస్తున్నట్టు ఓ వీడియో వైరల్ అయింది. అతడి అధికారిక ఫేస్‌బుక్ పేజీలో కనిపించింది.