తెలంగాణ

telangana

ETV Bharat / sports

గోల్ఫ్​ మైదానంలో ధోనీ.. ఫొటో షేర్​ చేసిన కేదార్​ - మహేంద్ర సింగ్​ ధోనీ

శుక్రవారం(నవంబర్​ 15) రాంచీ మైదానంలో నెట్స్‌లో సాధన చేస్తూ సందడి చేసిన మహేంద్ర సింగ్​ ధోనీ... ఈసారి గోల్ఫ్​ ఆడుతూ కనిపించాడు. తన సహచరులు కేదార్​ జాదవ్​, ఆర్పీ సింగ్​తో కలిసి గోల్ఫ్​ కోర్టులో తీసుకున్న ఫొటోను..  జాదవ్​ తన ఇన్​స్టా వేదికగా పంచుకున్నాడు.

గోల్ఫ్​ మైదానంలో ధోనీ... ఫొటో షేర్​ చేసిన కేదార్​

By

Published : Nov 17, 2019, 5:51 AM IST

Updated : Nov 17, 2019, 6:43 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టత రాలేదు. 'మిస్టర్‌ కూల్‌' ఎప్పుడు కూల్‌గా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అని.. అతడి అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అయితే ఊహించని విధంగా శుక్రవారం రాంచీ మైదానంలో ప్రాక్టీసు చేసిన మహీ... మళ్లీ తన రాకపై సందేహాలు రేకెత్తించాడు. అయితే తాజాగా గోల్ఫ్​ కోర్టులో తన స్నేహితులు ఆర్పీ సింగ్​, కేదార్​ జాదవ్​తో కలిసి కనిపించాడు.ధోనీతో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్​స్టా వేదికగా పంచుకున్నాడు జాదవ్​.

గోల్ఫ్​పై ఆసక్తి...

గతంలోనూ అమెరికాలో గోల్ఫ్‌ స్టిక్‌ పట్టుకుని కనిపించాడు మిస్టర్​ కూల్​. అమెరికా క్లబ్‌లో సెప్టెంబర్ 13 తన తొలి గోల్ప్‌ టోర్నమెంట్‌ ఆడాడు. స్థానిక ఆటగాడు రాజీవ్‌ శర్మతో కలిసి ఫ్లైట్‌ కేటగిరీలో ఏకంగా రెండో స్థానంలో నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు ధోనీ విజయం సాధించడం విశేషం. మెటుచన్ గోల్ఫ్‌, కంట్రీ క్లబ్‌లో ధోనీ గౌరవ సభ్యుడిగా ఉన్నాడు.

ఇంకా సందిగ్ధమే..

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్‌ నిష్క్రమించిన తర్వాత ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవ చేయాలని అతడు వెస్టిండీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. సైనిక శిక్షణ ముగించిన తర్వాత స్వదేశంలో సఫారీలతో జరిగిన పొట్టిఫార్మాట్‌ సిరీస్‌కూ అందుబాటులో లేడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే, నవంబర్‌లో జరగనున్న బంగ్లా సిరీస్‌కు కూడా ధోనీ అందుబాటులోకి రాలేదు. చాన్నాళ్ల తర్వాత ఇటీవల మైదానంలో అడుగుపెట్టిన మహీ... స్థానిక ఆటగాళ్లతో కలిసి బ్యాటింగ్‌ చేశాడు. వెస్టిండీస్‌తో టీ20, వన్డే సిరీస్‌ల తర్వాత అతడు అందుబాటులోకి రావచ్చని సమాచారం.

Last Updated : Nov 17, 2019, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details