లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబంతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో కుమార్తె జీవాతో బైక్‌పై సవారి చేస్తున్నాడు. ధోని భార్య సాక్షి వీడియోను చిత్రీకరించగా.. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ట్విట్టర్లో షేర్ చేసింది.
సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉండే సాక్షి.. ధోనీకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది. ఇటీవలే ధోనీ ఫామ్‌హౌస్‌లోని గార్డెన్లో పని చేస్తున్న ఫొటోను నెట్టింట షేర్ చేసింది.
మహేంద్రసింగ్ ధోనీ.. ఇంగ్లాండ్ వేదికగా 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో చివరిసారిగా బ్యాట్ పట్టాడు. ఆ మ్యాచ్‌లో 77 బంతుల్లో 50 పరుగులు చేసి మార్టిన్ గప్తిల్ చేతిలో రనౌట్ అయి వెనుదిరిగాడు. ఈ పోరులో 18 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఆ తర్వాత ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ధోనీ ప్రాతినిధ్యం వహించలేదు. ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ శిక్షణా శిబిరంలో మహీ పాల్గొన్నాడు. కరోనా లాక్డౌన్ కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటంతో ఆటగాళ్లు ఇళ్లకు వెళ్లిపోయారు.
ఇదీ చూడండి.. లాక్డౌన్లో సరికొత్త లుక్‌తో దర్శనమిచ్చిన కపిల్