చెన్నై సూపర్‌కింగ్స్ యువ బౌలర్ దీపక్ చాహర్‌పై కెప్టెన్ ధోనీ చాలా ఆధారపడ్డాడని చెప్పాడు మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్. అందుకే అతడి ఫిట్నెస్, ఫామ్ చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. స్టార్‌స్పోర్ట్స్ 'క్రికెట్ కనెక్టెడ్' ఎపిసోడ్లో ఈ విషయాల్ని వెల్లడించాడు.
'ధోనీ.. అతడిపై చాలా ఆధారపడి ఉన్నాడు' - deepak chahar ipl 2020
చెన్నై జట్టులోని యువబౌలర్ దీపక్ చాహర్‌పై ధోనీ చాలా ఆధారపడి ఉన్నాడని తెలిపాడు అజిత్ అగార్కర్. సీఎస్కే తన తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్‌తో సెప్టెంబరు 19న ఆడనుంది.
ఆగస్టు మూడో వారంలో ఐపీఎల్ కోసం యూఏఈలో అడుగుపెట్టింది సీఎస్కే ఆరురోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని, టెస్ట్‌లు చేయించుకోగా జట్టులోని దీపక్ చాహర్, రుతురాజ్‌తో పాటు 11 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం దీపక్ కోలుకున్నాడు. ప్రాక్టీసులోనూ పాల్గొన్నాడు. ఇప్పటికే సీనియర్ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌లు ఈ సీజన్‌కు దూరమైన నేపథ్యంలో చెన్నై జట్టు పరిస్థితి గురించి అగార్కర్ మాట్లాడాడు.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ జరగనుంది. దుబాయ్, షార్జా, అబుదాబీ దీనికి వేదికలు.