టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మైకెల్ హస్సీ. వీరిద్దరూ ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఆడారు. డెత్ ఓవర్లలో మహీ ఎలా బ్యాటింగ్ చేస్తాడో వివరించాడు హస్సీ. ఓ వ్యూహం ప్రకారం మ్యాచ్‌లను ముగిస్తుంటాడని అన్నాడు.
'ఆ విషయం నేను ధోనీ నుంచే నేర్చుకున్నా' - ipl dhoni
ప్రముఖ క్రికెటర్ ధోనీలో నమ్మశక్యం కాని శక్తి దాగి ఉందని చెప్పాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మైకెల్ హస్సీ. అతడి నుంచి తాను ఓ విషయం నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.
"క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన ఫినిషర్. మ్యాచ్ జరుగుతున్నప్పుడు సైలెంట్‌గా వ్యూహాలు రచిస్తాడు. అతడిలో నమ్మశక్యం కాని శక్తి దాగుంది. బంతిని ఎప్పుడు బౌండరీ దాటించాలో మహీకి బాగా తెలుసు. అనుకున్న సమయంలో హిట్టింగ్ చేయగలడు. అతడి ఆత్మవిశ్వాసం అలాంటిది. ఒకే ఓవర్లో 12-13 పరుగులు చేయడం ధోనీ నుంచి నేను నేర్చుకున్నా. ఆఖరి వరకు వేచి చూడటం మహీ స్టైల్. ఎందుకంటే ఆ సమయంలో ఒత్తిడి తనపై కంటే బౌలర్లపైనే ఎక్కువగా ఉంటుందని అతడికి బాగా తెలుసు" -మైకెల్ హస్సీ, ఆసీస్ మాజీ క్రికెటర్
గతేడాది ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌లో చివరగా ఆడిన ధోనీ, ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మైదానంలో కనిపించలేదు. ఐపీఎల్లో బరిలోకి దిగాలనుకున్న అతడికి కరోనా రూపంలో అడ్డంకి ఎదురైంది. భారత్‌లో లాక్‌డౌన్‌ను మే 3వ తేదీకి పొడిగించడం వల్ల, టోర్నీ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి.