తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ విషయంలో ధోనీకి ఎవరూ సాటిలేరు: సెహ్వాగ్ - indian team management

భారత మాజీ క్రికెటర్​, విధ్వంసకర బ్యాట్స్​మన్ వీరేంద్ర సెహ్వాగ్​... మాజీ కెప్టెన్ ధోనీ గురించి మాట్లాడాడు. ప్రస్తుతం మన జట్టులో విఫలమైన వెంటనే మార్పులు చేస్తున్నారని, మహీ కెప్టెన్సీలో అలా ఉండేది కాదని అభిప్రాయపడ్డాడు.

Virender Sehwag
'ప్రతిభ​ను ఉపయోగించుకోవడంలో ధోనీకి సాటిలేరు'

By

Published : Jan 21, 2020, 3:22 PM IST

Updated : Feb 17, 2020, 9:06 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​.. మహేంద్ర సింగ్​ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. మహీ కెప్టెన్సీలో భారత్​కు అన్ని రంగాల్లో బలంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల కేఎల్​ రాహుల్​ అయిదో స్థానంలో ఆడాడు. ఈ విషయంపైనా మాట్లాడాడు ఈ స్టార్​ క్రికెటర్​.

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

"ఐదో స్థానంలో ఆడిన కేఎల్​ రాహుల్​ 4 సార్లు విఫలమైతే.. ప్రస్తుతం ఉన్న టీమిండియా యాజమాన్యం వెంటనే అతడి స్థానాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుంది. అదే ధోనీ కెప్టెన్సీలో ఆ పరిస్థితి ఉండేది కాదు. మరిన్ని అవకాశాలు ఇచ్చేవాడు. కష్టసమయంలో మహీ.. జట్టు సభ్యుల కు మద్దతుగా నిలిచేవాడు"
-- సెహ్వాగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

ఒకరికి ఓ స్థానం కేటాయిస్తే.. అందులో ఆకట్టుకున్నా, కాస్త నిరాశపర్చినా అవకాశాలు వస్తుండేవని అన్నాడు సెహ్వాగ్​. ధోనీ సారథ్యంలో తుదిజట్టు కూర్పుపై స్పష్టమైన అవగాహన ఉండేదని అభిప్రాయపడ్డాడు.

"ధోనీ కెప్టెన్​గా ఉన్న సమయంలో ప్రతి అంశంలోనూ పక్కా క్లారిటీ ఉండేది. ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్​ చేయాలి అనేది ముందుగానే నిర్ణయించేవారు. ప్రతిభ​ ఉన్న క్రికెటర్లపై మహీ ఎప్పుడూ కన్నేసి ఉంచేవాడు. భారత క్రికెట్​ను ముందుకు తీసుకెళ్తారని భావిస్తే, వారిపై ధోనీ ఎక్కువగా దృష్టిపెట్టేవాడు"
-- సెహ్వాగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

ధోనీ కెప్టెన్​గా ఉన్నప్పుడు వన్డేల్లో టాపార్డర్​ బ్యాట్స్​మన్​ మరింతగా రాణించారని చెప్పిన సెహ్వాగ్​... మిడిలార్డర్​ ఆటగాళ్లకు అతడి బ్యాటింగ్​మద్దతుగా ఉండేదని గుర్తుచేసుకున్నాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

"ఆటగాళ్లకు సమయం ఇవ్వకపోతే తప్పులను ఎలా సరిదిద్దుకుంటారు. ఓపెనింగ్​కు మారకముందు నేను తొలుత మిడిలార్డర్​లో ఆడాను. చాలా తప్పిదాలు చేశాను. ఫలితంగా చాలా మ్యాచ్​లు ఓడిపోయాం. బాగా ఆడగలిగే సత్తా ఉన్నోడిని బెంచ్​లో కూర్చోపెట్టకూడదు. వారికి కాస్త సమయమివ్వాలి"
-- సెహ్వాగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

ఈ మధ్య కాలంలో భారత్.. యువ క్రికెటర్లను ఎక్కువగా పరీక్షిస్తోంది. పంత్​, సైనీ, శ్రేయస్​, శార్దూల్​ వంటి ఆటగాళ్లను భవిష్యత్తు తారలుగా మల్చుకుంటోంది. సంజూ శాంసన్​ విషయంలో మాత్రం తగిన న్యాయం చేయడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Last Updated : Feb 17, 2020, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details