తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇంకెవరు.. ధోనీనే ఉత్తమ కెప్టెన్' - ధోనీ

ఈ దశాబ్దంలో మేటి సారథి ఎవరు? అని సామాజిక మాధ్యమాల్లో ఐసీసీ పోల్ పెట్టగా, విపరీతంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇందులో ఎక్కువగా భారత మాజీ కెప్టెన్ ధోనీ పేరే వినబడుతోంది.

MS Dhoni
ధోనీ

By

Published : Dec 26, 2019, 1:35 PM IST

ఈ దశాబ్దంలో మేటి కెప్టెన్​ ఎవరు? అని ప్రశ్నిస్తే.. అందులో ఎక్కువ శాతం మహేంద్ర సింగ్ ధోనీ అనే జవాబు వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ఇదే ప్రశ్నను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంది. ఇంకేముంది ధోనీనే ఉత్తమ సారథి అని కామెంట్లతో సందడి చేస్తున్నారు నెటిజన్లు.

ఈ ప్రశ్నపై భారత అభిమానుల నుంచి ఐసీసీకి రీట్వీట్లు పోటెత్తుతున్నాయి. "ఇంకెవరు? ఎంఎస్‌ ధోనీయే" అని వారు స్పందిస్తున్నారు. "ఈ దశాబ్దపు సారథి ఎంఎస్ ధోనీ", "ఏదేమైనా ఎంఎస్‌ ధోనీయే. ప్రపంచ క్రికెట్లో, భారత్‌లో అతడే అత్యుత్తమ కెప్టెన్‌", 'ఈ దశాబ్దం ధోనీది. వచ్చే దశాబ్దం కోహ్లీది" అని అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత మహీ నిరవధిక విరామం తీసుకున్నాడు. జనవరి తర్వాత అతడి భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఐసీసీ నిర్వహించే అన్ని ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథి ఎంఎస్ ధోనీ. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌, ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను అతడు కైవసం చేసుకున్నాడు. సారథిగా ఇంతకన్నా మెరుగైన రికార్డు మరెవ్వరికీ ఉండదు.

ఇవీ చూడండి.. ఆటతో అలరించి.. ఆర్భాటం లేకుండా ముగించారు

ABOUT THE AUTHOR

...view details