అహ్మదాబాద్‌లోని స్టేడియం (సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం) ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా అవతరించనుంది. లక్ష 10 వేల మంది సామర్ధ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. రూ.700 కోట్ల రూపాయలతో నిర్మించారు. తాజాగా ఈ స్టేడియంకు సంబంధించిన డ్రోన్ ఫొటోను ట్వీట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).
ఈ నెల 24న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ మైదానాన్ని ప్రారంభించనున్నారు. అక్కడే 'నమస్తే ట్రంప్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.