ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 231 పరుగులు చేశాడు.
ఈ జాబితాలో కేఎల్ రాహుల్ 224 పరుగులతో(2020లో న్యూజిలాండ్‌పై) తర్వాతి స్థానంలో ఉన్నాడు. కోలిన్ మన్రో- 223 పరుగులు (2018లో వెస్టిండీస్‌పై- 3 మ్యాచ్‌ల సిరీస్), హామిల్టన్ మసకజ్జ 222 పరుగులు(బంగ్లాదేశ్‌పై) 3, 4 స్థానాల్లో ఉన్నారు.
కెప్టెన్‌గా..
- ఇక కెప్టెన్‌గా టీ20ల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. ఫించ్ (1462), విలియమ్సన్(1383) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- పొట్టి ఫార్మాట్లో కెప్టెన్‌గా అత్యధిక అర్ధసెంచరీలు చేసిన ఆటగాడు కోహ్లీనే. 12 సార్లు సారథిగా 50కిపైగా స్కోరు సాధించాడు విరాట్. ఈ జాబితాలో విలియమ్సన్(11), ఫించ్(10) తర్వాత నిలిచారు.
- ఇంగ్లాండ్‌పై టీ-20ల్లో మొత్తంగా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడూ కోహ్లీనే. చివరి టీ-20లో 80 పరుగులు చేసిన విరాట్.. ఫించ్‌ను దాటాడు.