ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు సరైన సమయంలోనే అందుబాటులోకి వస్తారని ఫ్రాంచైజీ సీఈఓ వెంకీ మైసూర్ అన్నారు. బయో సెక్యూర్ వాతావరణం నుంచి మరో బబుల్‌లోకి ప్రవేశిస్తుండటం వల్ల.. వీరంతా లీగ్‌లో విధించిన ఆరు రోజుల క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే దుబాయ్‌కి చేరుకునే విదేశీ ఆటగాళ్లు.. తొలి రోజు నుంచే ఐపీఎల్ జట్టు సభ్యులతో కలిసిపోనున్నారు. మరోవైపు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తే దుబాయ్ ప్రభుత్వం తప్పనిసరి విధించిన క్వారంటైన్ కూడా అవసరం లేదు.
"వారిని (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు) శానిటైజ్ చేయించిన విమానంలో తీసుకొచ్చి ఇమ్మిగ్రేషన్, టెస్టింగ్, కాంటాక్ట్ లెస్ తదితర అంశాలను జాగ్రత్తగా చూసుకుంటే బుడగలోకి రావడానికి అనుమతిస్తారా?. ఐపీఎల్ సజావుగా సాగేందుకు.. చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. అందుకోసం ఏఓపీ(ప్రొటోకాల్స్)ను కూడా విధించారు. అయితే, ఒక బబుల్‌లో నుంచి మరొక బబుల్‌లోకి వస్తే.. ఆటగాళ్లకు తప్పనిసరి క్వారంటైన్ అవసరం లేదు."