తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫీల్డింగే మా కొంప ముంచింది: మోర్గాన్ - cricket

పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో చెత్త ఫీల్డింగ్​ తమ కొంపముంచిందని అన్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్.

మ్యాచ్

By

Published : Jun 4, 2019, 1:09 PM IST

ప్రపంచకప్​లో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్​ జట్టు పాకిస్థాన్​పై ఓటమి పాలైంది. సమష్టిగా రాణించిన పాక్.. ఇంగ్లీష్ జట్టుకు ఝలక్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్​లో ఓటమికి కారణం తమ జట్టు చెత్త ఫీల్డింగ్​ అని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ తెలిపాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్​ ప్రారంభ మ్యాచ్​లో అద్భుత ఫీల్డింగ్​తో ఆకట్టుకున్న ఇంగ్లాండ్​ పాకిస్థాన్​తో మ్యాచ్​లో మాత్రం విఫలమైంది. జట్టులో మంచి ఫీల్డర్​గా ఉన్న జాసన్ రాయ్.. హఫీజ్​ క్యాచ్​ను వదిలేయడం ఇంగ్లాండ్​ జట్టు కొంపముంచింది. 14 పరుగుల వద్ద అతని క్యాచ్​ వదిలేశాడు రాయ్​. చివరకు 84 పరుగులు చేసి పాక్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

"చెత్త ఫీల్డింగ్ వల్ల మేం 50 నుంచి 60 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం. బ్యాటింగ్​, బౌలింగ్​లోఅప్పుడప్పుడు విఫలమైనా ఫీల్డింగ్​లోని లోపాలు బాధ కలిగిస్తాయి. మా జట్టులో ఇలా జరగడం చాలా అరుదు.''

-మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్

ఈ మ్యాచ్​లో 349 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 334 పరుగులకే పరిమితమైంది. జట్టులో రూట్ (107), బట్లర్ (103) అద్భుత పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.

బౌలర్ ప్లంకెట్ స్థానంలో మార్క్​వుడ్​ని తీసుకోవడాన్ని సమర్థించుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్. వుడ్​ ఎక్కువ పేస్ రాబట్టగలడని.. అతడి బౌలింగ్​లో పాక్ బ్యాట్స్​మెన్ ఇబ్బందిపడతారని అనుకున్నామని పేర్కొన్నాడు.

ఇవీ చూడండి.. WC19: పాక్- ఇంగ్లాండ్​ మ్యాచ్​లో రికార్డులు

ABOUT THE AUTHOR

...view details