క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడికి ఒత్తిడి అనేది సాధారణమని అంటున్నాడు ఆస్ట్రేలియన్ పేసర్ పాట్ కమిన్స్. రకరకాల ఒత్తిడి కారణంగా సగటు క్రికెటర్ ఉత్తమ ప్రదర్శన చేసే అవకాశం తక్కువని అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక ధర పలికినంత మాత్రానా, పరిస్థితులన్నీ కలిసి రావని తెలిపాడు.
"ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేవాళ్లెవరైనా చాలా ఒత్తిడికి లోనవుతారు. ఏదైనా ఆట గెలిస్తే.. ఆ గెలుపును తర్వాతి మ్యాచ్లో నిలుపుకోవాలనే ఒత్తిడి.. ఒకవేళ ఓడితే ఆటతీరుపై ఒత్తిడి.. ఇలా ఉంటూనే ఉంటుంది. నాకు తెలిసి ఐపీఎల్ వేలం.. ఆటగాడిపై మరికొంత ఒత్తిడి తెస్తుంది. ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కోవాలనేదే మా ప్రయత్నం. డబ్బులు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన.. బాల్ స్వింగ్లోగానీ, బౌలర్లకు పిచ్ అనుకూలతలో గానీ ఎలాంటి మార్పు ఉండదు. అదే విధంగా బౌండరీలు పెద్దవిగా మారవు. కాబట్టి, మైదానంలో ఆడేటప్పుడు ఆటపై మన ఏకాగ్రత ముఖ్యం. నేను కోల్కతా నైట్రైడర్స్ జట్టులో ఉన్న కారణంగా ఆ టీమ్ గెలుపొందేందుకు నా వంతు సహకారం అందిస్తాను".
- పాట్ కమిన్స్, కోల్కతా నైట్రైడర్స్ పేసర్