ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్.. తన మానసిక ఆరోగ్యం గురించి తాజాగా వెల్లడించాడు. ఒకానొక సమయంలో ఆత్మహత్యకు పాల్పడదామన్న ఆలోచన వచ్చిందని తెలిపాడు. 2017 నుంచి మానసిక ఒత్తిడితో బాధ పడుతున్న ఈ క్రికెటర్.. ఆస్ట్రేలియా తరఫున 11 వన్డేలు, 11 టీ20లు, నాలుగు టెస్టులు ఆడాడు.
'ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా' - మొయిసెస్ హెన్రిక్స్ సూసైడ్ న్యూస్
మానసిక ఆందోళన తీవ్రంగా ఉన్న కారణంగా ఒకానొక దశలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ హెన్రిక్స్ తెలిపాడు. కారును పిల్లర్‌కు ఢీకొట్టాలన్న ఆలోచన వచ్చేదని.. అయితే తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ఆగిపోయానని తాజాగా వెల్లడించాడు.
'ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా'
"మానసిక ఒత్తిడికి సంబంధించి గూగుల్‌లో చూసిన లక్షణాలలో ప్రతి ఒక్కటి నాలో ఉన్నాయి. ఆ సమయంలో అనేక రకాల ఔషధాలు పరిశీలించాను. ఓ దశలో ఎవరికి కాల్ చేయాలో అర్థమయ్యేది కాదు. ఒక్కోసారి కారులో 110 కి.మీ వేగంతో వెళ్లి పిల్లర్‌కు ఢీ కొట్టాలనిపించేది. ఆ సమయంలో సోదరులు, భార్య క్రిస్టా గుర్తొచ్చారు. వెంటనే ఆలోచన విరమించుకున్నా" అని హెన్రిక్స్ తెలిపాడు.
ఇదీ చూడండి..'సచిన్‌ను దూషించినందుకు బాధపడ్డా'