తెలంగాణ

telangana

ETV Bharat / sports

గ్రీన్​కు కంకషన్‌.. సిరాజ్‌ క్రీడాస్ఫూర్తి - Sirajs spirit of cricket

ఆస్ట్రేలియా-ఎ, టీమ్​ఇండియా-ఎ మధ్య జరిగిన రెండో సన్నాహక మ్యాచ్​లో కంకషన్​కు గురయ్యాడు గ్రీన్​. అయితే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న సిరాజ్‌ పరుగు గురించి ఆలోచించకుండా వెంటనే బ్యాట్‌ను కిందపడేసి గ్రీన్‌ దగ్గరికి వెళ్లి అతడికెలా ఉందో అడిగి తెలుసుకున్నాడు. దీంతో అతడు చూపిన క్రీడా స్ఫూర్తిని అందరు ప్రశంసిస్తున్నారు.

Sirajs spirit
సిరాజ్‌ క్రీడాస్ఫూర్తి

By

Published : Dec 12, 2020, 6:41 AM IST

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఎ, టీమ్​ఇండియా-ఎ మధ్య జరిగిన రెండో సన్నాహక మ్యాచ్​లో భారత పేసర్‌ సిరాజ్‌ చూపించిన క్రీడా స్ఫూర్తి ప్రశంసలందుకుంటోంది. ఈ పోరులో బుమ్రా.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి పొరపాటున గ్రీన్‌ తలకు బలంగా తాకింది. ఫలితంగా నొప్పితో విలవిల్లాడిన గ్రీన్‌ పిచ్‌లోనే కూలబడ్డాడు.

అయితే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న సిరాజ్‌ పరుగు గురించి ఆలోచించకుండా వెంటనే బ్యాట్‌ను కింద పడేసి గ్రీన్‌ దగ్గరికి వెళ్లిపోయాడు. అతడికెలా ఉందో అడిగి తెలుసుకున్నాడు. కంకషన్‌కు గురైన గ్రీన్‌ వెంటనే మైదానం వదిలి వెళ్లాడు. అతని స్థానంలో ప్యాట్రిక్‌ బ్యాటింగ్‌ చేశాడు. తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ ఓపెనర్‌ పకోస్కీ, టీ20 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్‌ జడేజా కూడా కంకషన్‌కు గురయ్యారు.

ఇదీ చూడండి : బుమ్రా కొట్టిన షాట్​కు ఆసీస్ బౌలర్​ విలవిల

ABOUT THE AUTHOR

...view details