తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విరామ సమయంలో హ్యాట్రిక్​ గురించే ఆలోచించా' - మహ్మద్ షమీ

బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్టు​లో టీమిండియా బౌలర్ షమికి హ్యాట్రిక్ తీసే అవకాశం వచ్చింది. కానీ సాధ్యపడలేదు. ఈ విషయంపై స్పందించాడీ క్రికెటర్.

షమీ

By

Published : Nov 14, 2019, 7:47 PM IST

భారత్​-బంగ్లాదేశ్ మొదటి టెస్టు తొలిరోజున టీమిండియా ఆధిపత్యం వహించింది. భారత బౌలర్లు ధాటికి 150 పరుగలకే ఆలౌటైంది బంగ్లా. షమి.. మూడు వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్​లోనూ హ్యాట్రిక్​ గురించే ఆలోచించానని అన్నాడు.

"భారత్​ తరఫున వికెట్ తీస్తే అది ఎంతో గొప్పగా అనిపిస్తుంది. బౌలర్లు, బ్యాట్స్​మెన్ ఎవరు బాగా ఆడినా.. మేమంతా ఎంజాయ్ చేస్తాం. టీ బ్రేక్ సమయంలో హ్యాట్రిక్ గురించే ఆలోచించా."
-షమి, టీమిండియా బౌలర్

తొలి రోజు టీ విరామానికి ముందు ఓవర్లో వరుసగా ముష్ఫీకర్ రహీం, మెహదీ హాసన్​ వికెట్లను తీశాడు షమి. ఫలితంగా హ్యాట్రిక్​ వికెట్లు అతడి మదిలో నిలిచాయి. కానీ అది సాధ్యం కాలేదు. మొత్తంగా ఈ మ్యాచ్​లో 13 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు.

ఇవీ చూడండి.. పాక్​లో టెస్టు సిరీస్​.. నిరీక్షణ ఫలించిన వేళ

ABOUT THE AUTHOR

...view details