కరోనా కారణంగా చాలా కాలంగా ఆటగాళ్లు ప్రాక్టీస్ లేకుండా ఉన్నారు. టీమ్ఇండియా క్రికెటర్లు ఇంటివద్దే కుటుంబంతో సమయం గడుపుతున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆటగాళ్లు ఔట్డౌర్లో శిక్షణ ప్రారంభిస్తున్నారు. తాజాగా పేసర్ మహ్మద్ షమి బౌలింగ్ ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు.
ప్రాక్టీస్‌లో మునిగి తేలిన షమి.. వీడియో పోస్ట్ - ప్రాక్టీస్‌లో మునిగి తేలిన షమీ
లాక్డౌన్ సమయాన్ని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు టీమ్ఇండియా క్రికెటర్లు. కొందరు ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. బౌలర్ మహ్మద్ షమి తన ఫామ్ హౌస్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు.

షమీ
ఈ వీడియోలో తన సోదరులకు బౌలింగ్ చేస్తూ కనిపించాడు షమి. తన ఫామ్‌హౌస్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. "ఫామ్‌హౌస్‌లో సోదరులతో కలిసి నాణ్యమైన ప్రాక్టీస్ సెషన్." అంటూ క్యాప్షన్ ఇచ్చాడీ బౌలర్.
భారత పేస్ దళంలో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు మహ్మద్ షమి. స్వదేశీ పిచ్‌లపైనే కాకుండా విదేశాల్లోనూ రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ ముందున్న దృష్ట్యా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ శిక్షణను కొనసాగిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ రెండు టోర్నీలు వాయిదా పడ్డాయి.
Last Updated : Jul 3, 2020, 3:16 PM IST