భారత జట్టు ప్రధాన పేసర్ మహ్మద్ షమి.. మరోసారి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే వికెట్లు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. కటక్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఒక వికెట్ తీసి ఈ రికార్డు అందుకున్నాడు.
ఈ ఏడాదిలో షమి 21 మ్యాచ్‌లు ఆడి 42 వికెట్లు సాధించాడు. ఇందులో ఐదు వికెట్లను ఒకసారి సాధించగా.. ఒక హ్యాట్రిక్‌ను కూడా నమోదు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్(38), ఫెర్గుసన్(35) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్(33), కుల్దీప్ యాదవ్(32)లు ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. చాహల్(29) తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. గతంలో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లుగా కపిల్‌దేవ్(32 వికెట్లు), అజిత్ అగార్కర్ (58 వికెట్లు), ఇర్ఫాన్ పఠాన్ (47 వికెట్లు)లు అగ్రస్థానంలో నిలిచారు. నాలుగో బౌలర్‌గా షమి ఘనత సాధించాడు.
2014లో ఒకసారి...
ఒక క్యాలెండర్ ఇయర్‌లో షమి... అత్యధిక వన్డే వికెట్లు సాధించడం ఇది రెండోసారి. 2014లో తొలిసారి అత్యధిక వన్డే వికెట్ల జాబితాలో మొదటిసారి టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడీ పేసర్.