అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్, ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ.. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయంపై నబీ మాట్లాడుతున్న ఓ వీడియో సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ప్రస్తుతం బంగ్లాదేశ్తోజరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ అనంతరం వీడ్కోలు పలకనున్నాడీ క్రికెటర్.
"గత 18 ఏళ్లుగా అఫ్గానిస్థాన్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నా. అఫ్గాన్‌కు టెస్టు హోదా తీసుకురావాలనే నా కల సాకారమైంది. మేము ఏడాదికి ఒకటి లేదా రెండు టెస్టులు మాత్రమే ఆడుతున్నాం. అందులో భాగమవ్వాలని నేను అనుకుంటాను.ప్రతి ఆటగాడు 5 రోజుల క్రికెట్ ఆడాలనుకుంటాడు. అందుకే ఇప్పుడు నా స్థానంలో యువ క్రీడాకారులకు అవకాశమివ్వాలని భావిస్తున్నా". -మహ్మద్ నబీ వీడియో సందేశం.