హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ)లో విభేధాలు మళ్లీ రచ్చకెక్కాయి. సొంత కమిటీపైనే అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ నిప్పులు చెరిగాడు. హైదరాబాద్ క్రికెట్‌ను రక్షించడానికి ఆంధ్రాబ్యాంక్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ఇంప్లీడ్ అవుతానని సోమవారం ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులకు పంపిన సందేశంలో అజహర్ పేర్కొన్నాడు.
లీగ్ మ్యాచ్‌ల్ని నిలిపివేయాలని కోరతా: అజహర్ - మహ్మద్ అజహరుద్దీన్ తాజా వార్తలు
హెచ్‌సీఏలో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. సొంత కమిటీపైనే అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ నిప్పులు చెరిగాడు.
"ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ కోసం హెచ్‌సీఏ రూపొందించిన నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. 40 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను ఏ జట్టూ రిజిస్టర్ చేసుకోవద్దు. కనీసం ఏడు రంజీ, ముస్తాక్ అలీ, అండర్-23, అండర్-19 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లే మూడు రోజుల లీగ్ జట్టులో ఉండాలి. అయితే ఎపెక్స్ కౌన్సిల్‌లోని ఏ ఒక్కరు ఈ నిబంధనల్ని పట్టించుకోవడం లేదు. ఆంధ్రాబ్యాంక్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ఇంప్లీడ్ అవడం తప్ప నాకు మరో దారి కనిపించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న లీగ్ మ్యాచ్‌ల్ని నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరతా" అని అజహర్ పేర్కొన్నాడు.