తెలంగాణ

telangana

ETV Bharat / sports

వీళ్లను ఔట్ చేయగలమా అని అనుకున్నాం: ఆసిఫ్ - సెహ్వాగ్ ఆసిఫ్

2006లో భారత పటిష్ఠ బ్యాటింగ్​ లైనప్​ చూసి ఆందోళన చెందినట్లు చెప్పాడు పాక్​ మాజీ పేసర్ మహ్మద్ ఆసిఫ్. వాళ్లను ఔట్ చేయడానికి తీవ్రమైన కృషి చేయాల్సి వచ్చేదని చెప్పాడు.

Mohammad Asif recalls Karachi Test 2006 with team india
వాళ్లను ఔట్ చేసేది ఎలా..?

By

Published : Jan 4, 2021, 7:30 AM IST

2006లో టీమ్​ఇండియా పాకిస్థాన్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ జట్టులోని స్టార్​ బ్యాట్స్​మెన్​ను ఎలా ఔట్ చేసేదని మథనపడినట్లు పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆసిఫ్ చెప్పాడు. సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, ధోనీ లాంటి హేమాహేమీలతో టీమ్​ఇండియా పాక్ పర్యటనకు వచ్చిన సందర్భాన్ని యూట్యూబ్​ ఛానెల్​లో అతడు గుర్తు చేసుకున్నాడు.

"సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, ధోనీతో కూడిన దుర్బేధ్యమైన భారత బ్యాటింగ్ ఆర్డర్​ను చూసి.. 'వీళ్లను ఔట్ చేయగలమా' అని నేనూ, అక్తర్ అనుకున్నాం. ఆ జట్టులో వేల పరుగులు చేసిన బ్యాట్సమెన్​ ఉన్నారు. ధోనీ ఏడో స్థానంలో వస్తున్నాడంటేనే వాళ్ల బ్యాటింగ్ లోతు అర్థం అయింది. కానీ గొప్ప వేగంతో పాటు నైపుణ్యంతో బౌలింగ్ చేసిన అక్తర్ భారత జట్టుపై ఒత్తిడి పెంచాడు. అతని మెరుపు బౌన్సర్లు ఎదుర్కోవడానికి టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్ ఇబ్బంది పడ్డారు. కరాచీలో జరిగిన ఆఖరి టెస్టులో అతడు ఓ ఎండ్​లో ఇలా ఒత్తిడి పెంచడం వల్లే నేను వికెట్లు తీయగలిగాను" అని ఆసిఫ్ అన్నాడు.

ఈ సిరీస్​లో మూడో టెస్టులో మాత్రమే ఆడిన ఆసిఫ్ ఏడు వికెట్లు తీసి, పాక్ 1-0తో సిరీస్​ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. మూడు టెస్టుల సిరీస్​లో తొలి రెండు టెస్టులు డ్రా అయ్యాయి.

ఇదీ చూడండి:'ప్రస్తుతం అత్యంత తెలివైన బౌలర్​ బుమ్రా'

ABOUT THE AUTHOR

...view details