తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆమిర్ వీడ్కోలు నిర్ణయం ఆశ్చర్యకరం' - bit surprising

పాక్ బౌలర్​ ఆమిర్.. తక్కువ వయసులోనే టెస్టులకు రిటైర్మెంట్​ ప్రకటించడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. ఆమిర్​ నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని, అప్పుడే అవసరం ఏముందని అభిప్రాయపడ్డారు.

ఆమిర్

By

Published : Jul 27, 2019, 8:54 PM IST

పాకిస్థాన్ యువ పేసర్ మహ్మద్ ఆమిర్​ టెస్టు క్రికెట్​కు వీడ్కోలు పలకడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 27 ఏళ్ల వయసులో అత్యుత్తమైన ఈ ఫార్మాట్​కు టాటా చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

"టెస్ట్ క్రికెట్​కు ఆమిర్ వీడ్కోలు పలకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే 27 ఏళ్ల వయసులో నీ ప్రతిభను నిరూపించుకోవడానికి టెస్టు మ్యాచ్​లే అత్యుత్తుమం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​లో పాక్ జట్టుకు నీ సేవలు అవసరం".
-వసీం అక్రమ్, పాక్ మాజీ పేసర్​

పాక్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్...​ ఆమిర్​ రిటైర్మెంట్​​పై స్పందించాడు. ఇంత చిన్న వయసులో టెస్టులకు వీడ్కోలు పలకవలసిన అవసరం ఏముందంటూ మండిపడ్డాడు.

"నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఈ సమయంలో టెస్టు క్రికెట్‌ నుంచి వైదొలుగుతావా. ఇప్పటికే టెస్టుల్లో పాకిస్థాన్‌ ప్రదర్శన అంతంతమాత్రంగా ఉంది. ఇటువంటి సమయంలో దేశానికి నువ్వు ఇచ్చేది ఇదేనా. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదంలో నువ్వు చిక్కుకున‍్నప్పుడు పాక్ బోర్డు చాలా ఖర్చు పెట్టింది. కోలుకుని మళ్లీ ఫామ్​లోకి వచ్చావు. ఇపుడు ఈ నిర్ణయం సరైనదేనా.? మిగతా క్రికెటర్లూ నీలాగే ఆలోచిస్తే పరిస్థితి ఏంటి? అసలు పాక్‌ క్రికెట్‌లో ఏం జరుగుతోంది. దీనిపై పీసీబీ దృష్టి సారించాలి".
-షోయబ్ అక్తర్, పాక్ మాజీ బౌలర్

స్పాట్ ఫిక్సింగ్ తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన ఆమిర్​.. ప్రస్తుతం మంచి ఫామ్​లో ఉన్నాడు. ప్రపంచకప్​లోనూ సత్తాచాటాడు. ఈ సమయంలో అనూహ్యంగా ​టెస్టు క్రికెట్​కు వీడ్కోలు పలకడం పాక్ మాజీ ఆటగాళ్లు, అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇవీ చూడండి.. రాయ్ 'షూ' ఊడింది- స్టేడియం నవ్వులమయమైంది

ABOUT THE AUTHOR

...view details