ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 2020-21 సీజన్ కోసం ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించింది. ఇందులో పేసర్లు మహ్మద్ అమీర్, హసన్ అలీ, వాహబ్ రియాజ్‌లకు చోటు దక్కలేదు. ఈ లిస్టుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అమీర్, హసన్ పీసీబీ వాట్సప్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినట్లు సమాచారం. అయితే రియాజ్ మాత్రం గ్రూపులో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
పీసీబీ వాట్సప్ గ్రూప్ నుంచి అమీర్, హసన్ లెఫ్ట్! - హసన్ అలీ తాజా వార్తలు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన ఆటగాళ్ల కాంట్రాక్టుల లిస్టులో పేసర్లు మహ్మద్ అమీర్, హసన్ అలీ, వాహబ్ రియాజ్‌లకు చోటు దక్కలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమీర్, హసన్ పీసీబీ వాట్సప్ గ్రూపు నుంచి లెఫ్ట్ అయినట్లు సమాచారం.
పీసీబీ
పీసీబీ మొత్తం 18 మందికి కాంట్రాక్టులను ప్రకటించింది. ఇది జులై 1నుంచి అమల్లోకి వస్తుంది. ఇందులో నసీమ్ షా, ఇఫ్తికర్ అహ్మద్‌లు తొలిసారి చోటు దక్కించుకున్నారు. కాంట్రాక్టుల నుంచి తొలగించినా అమీర్, హసన్, రియాజ్‌లు సెలక్షన్‌కు అందుబాటులోనే ఉంటారని స్పష్టం చేసింది బోర్డు.
హసన్ అలీ చివరిసారిగా 2019 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. అమీర్, రియాజ్ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్నారు.