పాకిస్థాన్ ఆటగాళ్లు హరిస్ సోహైల్, మహ్మద్ ఆమిర్లు త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనకు దూరమయ్యారు. వీరిద్దరూ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్ నుంచి వైదొలిగినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలియజేసింది.
"ఆగస్టులో తన భార్య రెండో శిశువుకు జన్మనివ్వబోతున్న కారణంగా ఆమిర్ ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. హరిస్ సోహైల్ మాత్రం కుటుంబ కారణాల వల్ల ఇంగ్లాండ్ పర్యటనకు రాలేకపోతున్నాడు. ఆగస్టు-సెప్టెంబరులో ఇంగ్లీష్ గడ్డపై జరగనున్న మూడు టెస్టులు, మూడు టీ20లకు పాకిస్థాన్ నుంచి మొత్తం 28 మంది ఆటగాళ్లతో పాటు 14 మంది సహాయ సిబ్బందిని పంపిస్తున్నాం."
- పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
ఇంగ్లాండ్తో సిరీస్ ఆడాలని పాక్ క్రికెట్ బోర్డు ముందు నుంచే సమాలోచనలు చేస్తోంది. కరోనా కారణంగా బయట మైదానాల్లో శిక్షణా శిబిరాల్లో ఆడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆటగాళ్లకు సూచించింది. అయితే ఈ సిరీస్లో పాల్గొనడం లేదా విరమించుకోవడం అంతా ఆటగాడి వ్యక్తిగతమని.. దీని వల్ల క్రికెటర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోమని ఇటీవలే ఆ దేశ క్రికట్ బోర్డు వెల్లడించింది.
ఈ పర్యటనకు ఆటగాళ్లను జులైలోనే ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ పంపనుంది పాక్. సిరీస్ ప్రణాళిక కంటే ముందుగానే అక్కడికి పంపి ఆటగాళ్లకు తగిన శిక్షణ ఇవ్వాలని చూస్తోంది. ఈ సిరీస్ను బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి.
ఇదీ చూడండి... క్రికెట్లో అబద్ధాలు అనిపించే కొన్ని నిజాలు