టీ20 ఫార్మాట్ ఇప్పటికే క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇదే పొట్టి ఫార్మాట్లో త్వరలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఆడేమిక్స్డ్ జెండర్ మ్యాచ్‌లను తీసుకురానున్నారు. దీని కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కసరత్తులు చేస్తోంది. క్రికెట్‌లోనూ మిక్స్‌డ్ ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది.
త్వరలో క్రికెట్‌లోనూ మిక్స్‌డ్ మ్యాచ్‌లు - vivo ipl 2019
అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఆటడం బ్యాడ్మింటన్, టెన్నిస్, ఆర్చరీ, షూటింగ్, స్కాష్ వంటి క్రీడల్లోనే చూస్తుంటాం. కానీ త్వరలో క్రికెట్‌లోనూ ఈ పద్ధతిని రానుంది.
క్రికెట్‌లోనూ మిక్స్‌డ్ డబుల్స్ చూడొచ్చు
పురుషులు, మహిళా క్రికెటర్లు కలిసి ఆడే ఈ టీ-20 మ్యాచ్ వరల్డ్‌కప్ తర్వాత జరిగే అవకాశం ఉంది. భారతక్రికెట్ పురుషుల జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, వేదా కృష్ణమూర్తి ఈ జట్లలో ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పెట్టింది ఆర్సీబీ.