తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​ మహారాణి 'మిథాలీ రాజ్' 20 ఏళ్ల ప్రస్థానం - mithali raj in 20years cricketer

అగ్రశ్రేణి మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ అరుదైన రికార్డు సాధించింది. టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ, 20 ఏళ్ల కెరీర్​ను​ పూర్తి చేసుకుంది.

క్రికెట్​ను 20 ఏళ్లుగా ఏలుతున్న 'మిథాలీ రాజ్​'

By

Published : Oct 9, 2019, 2:53 PM IST

భారత స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్..​ 1999 జూన్​ 26న ఐర్లాండ్​పై​ వన్డేతో క్రికెట్​లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి 20 ఏళ్లుగా క్రికెట్​లో కొనసాగుతోంది​. ఫలితంగా ఎక్కువ కాలం క్రికెట్​ ఆడిన మహిళగా పేరు తెచ్చుకుంది. ఇన్నేళ్ల పాటు కెరీర్​ కొనసాగించిన వారిలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్​ తెందూల్కర్(22ఏళ్ల 91 రోజులు)​, సనత్​ జయసూర్య(21 ఏళ్ల 184 రోజులు), జావేద్​ మియాందాద్(20 ఏళ్ల 272 రోజులు) ఉన్నారు. వీరి సరసన చేరిన మిథాలీ... ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా క్రికెటర్​గా చరిత్ర సృష్టించింది. మొత్తంగా ఇప్పటివరకు 203 వన్డేల్లో 51.29 సగటుతో 6,720 పరుగులు చేసిందీ స్టార్​ ప్లేయర్​.

20 ఏళ్ల క్రికెట్​ కెరీర్​ను పూర్తి చేసుకున్న మిథాలీ

పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై...

మిథాలీ రాజ్‌.. ఇటీవలే పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 2021 ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొనే... టీ20 ఫార్మాట్‌కు దూరం అవుతున్నట్లు చెప్పింది. 32 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ క్రికెటర్​.... 2012 (శ్రీలంక), 2014 (బంగ్లాదేశ్‌), 2016 (భారత్‌)లో జరిగిన ప్రపంచకప్‌లలో పాల్గొంది.

20 ఏళ్ల క్రికెట్​ మహరాణి 'మిథాలీ'

మిథాలీ.. 1999లో ఇంగ్లాండ్​తో తొలి టీ20 ఆడింది. పొట్టి క్రికెట్​లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసింది. 89 మ్యాచ్​ల్లో 37.50 సగటుతో 2,364 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 99 నాటౌట్​. టీ20ల్లో 2000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌ ఉమెన్‌గానూ ఘనత సాధించింది. 10 టెస్టులే ఆడిన మిథాలీ​... 663 పరుగులు చేసింది. వాటిలో ఒక సెంచరీ, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details