భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ వరుస రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల 10 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచిన ఆమె.. ఇప్పుడు వన్డేల్లో అరుదైన ఘనత సాధించింది. ఈ ఫార్మాట్లో 7000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి మహిళా బ్యాట్స్‌ఉమన్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో దీనిని అందుకుంది. తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్(5992) ఉంది.
స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ మరో రికార్డు
వరుస ఘనతల్ని సాధిస్తున్న మిథాలీ రాజ్.. వన్డేల్లో మరో మైలురాయిని చేరుకుంది. ఈ ఫార్మాట్లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది.
స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ మరో రికార్డు
1999లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మిథాలీ.. నాలుగు దశాబ్దాల్లో ఆడిన ఏకైక క్రికెటర్‌గా ఘనత సాధించింది. అయితే 6000 వన్డే పరుగులు చేసిన తొలి పరుగులు చేసిన తొలి బ్యాట్స్ఉమెన్ కూడా ఈమెనే కావడం విశేషం.
ఇది చదవండి:ఆ మైలురాయిని చేరుకోవాలని ఉంది: మిథాలీ