బెంగళూరు వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో ఐదో స్థానంలో దిగిన మిచెల్ స్టార్క్ కేవలం మూడు బంతులే ఆడి డకౌటయ్యాడు. తన రెగ్యులర్ స్థానం కంటే ముందుగా వచ్చిన స్టార్క్ రవీంద్ర జడేజా వేసిన 32 ఓవర్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. భారత్ ముందు సాధ్యమైనంత ఎక్కువ లక్ష్యం ఉంచాలనే ఉద్దేశంతోనే స్టార్క్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చారు. అయితే ఇతడు డకౌట్‌గా వెనుదిరగడంపై అతడి భార్య అలిసా హేలీ స్పందించింది.
స్టార్క్ బ్యాటింగ్‌పై భార్య హేలీ ఫన్నీ ట్వీట్ - భారత్-ఆసీస్ వన్డే సిరీస్
టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆసీస్ జట్టు వైఫల్యంపై ఆ దేశ క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ ప్రదర్శనపై అతని భార్య సామాజిక మాధ్యమాల్లో స్పందించింది.
స్టార్క్ ఔటైన తీరును తన భార్య అలీసా హేలీ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేసింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలైన హేలీ.. ఇదేమి బ్యాటింగ్ అనే అర్థం వచ్చేలా ఒక ఎమెజీతో స్పందించింది. ఫాక్స్ క్రికెట్ పోస్ట్ చేసిన ఫోటోకు సమాధానంగా తలను చేతితో కొట్టుకుంటున్న ఎమోజీ పోస్ట్ చేసింది. ఇది వైరల్ కావడం వల్ల నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. 'మేడమ్.. మీరు చెప్పిన బ్యాటింగ్ టెక్నిక్స్‌ను స్టార్క్ మరిచిపోయాడేమో' అని ఒకరు కామెంట్ చేయగా, 'బ్యాటింగ్ ఎలా చేయాలో స్టార్క్‌కు నేర్పించండి' అని మరొకరు చమత్కరించారు.
ఇదీ చూడండి:- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా