ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు శుభవార్త. ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఎస్ఆర్హెచ్లో చేరనున్నాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాలతో ప్రస్తుత లీగ్‌కు దూరమయ్యాడు. దీంతో మార్ష్ స్థానంలో రాయ్‌ను జట్టులోకి తీసుకుంది హైదరాబాద్ జట్టు యాజమాన్యం.
గత సీజన్లో తొలి మ్యాచ్‌లోనే గాయం కారణంగా టోర్నీకి దూరమైన మార్ష్.. వ్యక్తిగత కారణాలతో ఈ సారి టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. 2010లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మార్ష్.. ఇప్పటివరకు 21 మ్యాచ్‌లాడాడు.