శ్రీలంకపై వన్డే సిరీస్‌ను గెల్చుకున్న పాకిస్థాన్.. టీట్వంటీ సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది. జట్టులోని కీలక బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్‌పై అతిగా ఆధారపడటమే ఇందుకు ఓ కారణమని చెప్పాడు ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్.
"మేం టీట్వంటీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సొంతం చేసుకోవడానికి బాబర్ అజమ్ ఓ కారణం. గత రెండు టీట్వంటీల్లో అతడు ఆశించిన ప్రదర్శన చేయలేదు. మేం ఆ సిరీస్‌ను కోల్పోయాం. ఒక్కడి మీదే ఆధారపడుకుండా ఆరుగురు మ్యాచ్ విన్నర్స్‌ను మేం తయారు చేసుకోవాల్సింది." -మిస్బా ఉల్హక్, పాక్ ప్రధాన కోచ్