తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​ ప్రధాన కోచ్​ ఎవరో తేలేది నేడే...! రేసులో మిస్బా - వకార్​ యూనిస్​

పాకిస్థాన్ క్రికెట్​​ జట్టు ప్రధాన కోచ్​ సహా చీఫ్​ సెలక్టర్ పదవికి ఎంపికయ్యేది ఎవరో నేడు తేలనుంది. దాయాది దేశ మాజీ క్రికెటర్​​ మిస్బావుల్​ హక్​ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు. బౌలింగ్​ కోచ్​గా వకార్​ యూనిస్​ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పాక్​ ప్రధాన కోచ్​ తేలేది నేడే... రేసులో మిస్బా

By

Published : Sep 4, 2019, 7:00 AM IST

Updated : Sep 29, 2019, 9:19 AM IST

పాక్​ క్రికెట్​ జట్టు ప్రధాన కోచ్​ సహా చీఫ్​ సెలక్టర్ పేరును నేడు వెల్లడించనుంది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీబీసీ). ఆ దేశ మాజీ క్రికెటర్​​ మిస్బావుల్​ హక్​ ఈ రేసులో ముందంజలో ఉన్నాడు. బౌలింగ్​ కోచ్​ పదవికి వకార్​ యూనిస్​ పోటీపడుతున్నాడు.

మిస్బా ఎంపికకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి ఎంపిక తర్వాత సహాయక బృందంపై స్పష్టత ఇవ్వనుంది పీసీబీ. ఈ బాధ్యతలు స్వీకరించేవారు 2023 ప్రపంచకప్​ వరకు జట్టు పర్యవేక్షణ చూడనున్నారు.

మిస్బావుల్​ హక్​, వకాయ్​ యూనిస్​

2010లో స్పాట్ ఫిక్సింగ్‌‌ వివాదంతో గాడి తప్పిన పాకిస్థాన్ జట్టును కెప్టెన్‌గా మిస్బావుల్ హక్​ చక్కదిద్దాడు. 45 ఏళ్ల ఈ క్రికెటర్‌కు కోచ్‌గా బాధ్యతలు అప్పగించి.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌‌ సమయానికి యువజట్టులో నిలకడ తీసుకురావాలని యోచిస్తోంది పీసీబీ. పాకిస్థాన్ తరఫున 75 టెస్టులు, 162 వన్డేలు ఆడాడు మిస్బావుల్.

లంకతో సిరీస్​...

శ్రీలంకతో స్వదేశంలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్​లు ఆడనుంది పాకిస్థాన్​. సెప్టెంబర్​ 27 నుంచి మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్​ ముందు జట్టులోని ఆటగాళ్లంతా సెప్టెంబర్​ 14 నుంచి ప్రారంభంకానున్న 'ఖైద్​ ఈ అజమ్​ ట్రోఫీ'లో ఆడాల్సి ఉంది.

ప్రపంచకప్​ తర్వాత వేటు..

ప్రపంచకప్​లో పాక్​ జట్టు పేలవ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసిన పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) ... కోచ్​ సహా పలు పదవుల్లో కొత్తవారిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. ప్రధాన కోచ్​ ఆర్థర్​, బౌలింగ్​ కోచ్​ అజహర్​ మొహ్మద్, బ్యాటింగ్​ కోచ్​ గ్రాంట్​ ఫ్లావర్​ల కాంట్రాక్టులను పునరుద్ధరించలేదు. ఈ ముగ్గురూ 3 ఏళ్లు పాక్​ జాతీయ జట్టుకు సేవలందించారు.

ఇదీ చదవండి...టీ20లకు ప్రముఖ క్రికెటర్ మిథాలీ వీడ్కోలు

Last Updated : Sep 29, 2019, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details