తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్ ఆటగాళ్లు మిస్బాకు కోపం తెప్పిస్తున్నారు..!

శ్రీలంకతో టీ-20 సిరీస్​లో క్లీన్​స్వీప్​ అయి విమర్శలు పాలైంది పాకిస్థాన్. ఈ సందర్భంగా ఆటగాళ్లపై అసహనం వ్యక్తం చేసాడట కోచ్​ మిస్బా. క్రికెటర్లు క్రమశిక్షణతో వ్యవహరించట్లేదని మండిపడినట్లు సమాచారం.

మిస్బా ఉల్ హక్

By

Published : Oct 15, 2019, 11:47 AM IST

Updated : Oct 15, 2019, 2:09 PM IST

పాకిస్థాన్​ ప్రధాన​ కోచ్ మిస్బా ఉల్ హక్ ఆ జట్టు ఆటగాళ్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడట. పాక్ ఆటగాళ్లు ట్రైనింగ్​కు సహకరించడంలేదని, క్రమశిక్షణగా వ్యవహరించట్లేదని.. మిస్బా అసహనం వ్యక్తం చేసినట్లు పాక్ క్రీడా వర్గాల సమాచారం.

"ఛీప్ సెలక్టర్​గా, హెడ్​కోచ్​గా రెండు కీలక పదవులు చేపట్టిన మిస్బాకు ఆటగాళ్లు విసుగు తెప్పిస్తున్నారు. కొంతమంది ట్రైనింగ్​కు హాజరు కాకుండా ఆటను పట్టించుకోవట్లేదు. క్రమశిక్షణగా వ్యవహరించకుండా ఇబ్బింది పెడుతున్నారు. ఎన్నిసార్లు క్షమించినా వారు ప్రొఫెషనల్​గా ప్రవర్తించట్లేదు"

-పాక్​ క్రికెట్​ బోర్డు ప్రతినిధి

కెప్టెన్ సర్ఫరాజ్​ అహ్మద్​ తీరుపైనా అసంతృప్తిగా ఉన్నాడట మిస్బా.

"పాక్ సారథి సర్ఫరాజ్ అహ్మద్​ ప్రవర్తన మిస్బాకు నచ్చట్లేదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సర్ఫరాజ్​ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నాడు. సీనియర్ ఆటగాళ్లైన వాహబ్ రియాజ్, ఇమాద్ వసీం, హ్యారీస్ సొహైల్ ప్రవర్తనకు మిస్బా ఆశ్చర్యపోతున్నాడు. ట్రైనింగ్ నుంచి తప్పించుకునేందుకు ఏవో కారణాలు చెబుతున్నారు"

- పీసీబీ ప్రతినిధి

ఇటీవల జరిగిన టీ20 సిరీస్​లో దాయాది జట్టును క్లీన్​స్వీప్​ చేశారు లంకేయులు. పీసీబీ(పాక్​ క్రికెట్​ బోర్డు)లో నూతన బాధ్యతలు చేపట్టాక సొంత గడ్డపైనే పరాజయం చెందడం వల్ల మిస్బా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: ప్రత్యేకం: పెళ్లి కాలేదు.. కానీ తల్లులయ్యారు..!

Last Updated : Oct 15, 2019, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details