ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ మార్పుపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. సీజన్ మధ్యలో అలా మార్చడం జట్టుకు మంచిది కాదని ట్వీట్ చేశాడు.
టోర్నీలో వరుస ఓటములు ఎదురవుతుండటం వల్ల సారథి దినేశ్ కార్తిక్‌పై విమర్శలు వస్తున్నాయి. దీంతో ముంబయితో మ్యాచ్‌కు ముందు ఇయాన్ మోర్గాన్‌కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ మేరకు ఫ్రాంచైజీ ప్రకటన కూడా చేసింది.