క్రికెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ వ్యాపారవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ ఉన్నారు.
ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్.. అమెరికన్ క్రికెట్ ఎంటర్ప్రైజెస్ (ఏసీఈ) నిర్వహించనున్న మేజర్ లీగ్ టోర్నీలో పెట్టుబడులు పెట్టినట్లు స్వయంగా వెల్లిడించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్తలు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇరువురు ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ శేఖర్ కూడా ఈ మేజర్ లీగ్ టోర్నీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.